Janhvi Kapoor : జాన్వీకపూర్ ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటుంది. ఆమె చేసే హంగామా మామూలుగా ఉండట్లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుగుతోంది. ఆ నడుమ ఇద్దరూ తిరుమలను దర్శించుకున్నారు. ఇక మైంబైలో నిత్యం రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఇద్దరూ. ఇప్పుడు ఏకంగా హాలిడే ట్రిప్ కు వెళ్లారు. జాన్వీకపూర్ వరుస సినిమాలతో మొన్నటి వరకు బిజీగా ఉంది. ఈ నడుమనే కాస్త గ్యాప్ దొరకడంతో ఆ టైమ్ ను తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది.
Read Also : Keerthy Suresh : తడబడకుండా ‘ఉప్పుకప్పురంబు’ పద్యం చెప్పిన కీర్తిసురేష్..
శిఖర్ పహారియాతో కలిసి లండన్ కు వెళ్లిపోయింది. లండన్ వీధుల్లో వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రైవసీ కోసం లండన్ వెళ్లినా ఆమెను ఫ్యాన్స్ వెంటాడుతున్నారు. అక్కడ వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అది చూసిన వారంతా జాన్వీకపూర్ మహా ముదురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది మూవీలో నటిస్తోంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. జాన్వీ పాత్ర గురించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
Read Also : Keerthy Suresh : విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్.. హింట్ ఇచ్చిందిగా..