Janhvi Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా వెండితెరకు పరిచయమైన జాన్వీ బాలీవుడ్ లోనే ఫ్యాషన్ ఐకాన్ గా పేరుతెచ్చుకొంది. ఇక కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీస్ తో నిత్యం పార్టీలో కనిపించే ఈ ముద్దుగుమ్మ తన బెస్ట్ ఫ్రెండ్, మరో హీరోయిన్ సారా అలీ ఖాన్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోకు అటెండ్ అయిన విషయం విదితమే.
ఇక ఈ షో లో అందగత్తెలు ఇద్దరు కొన్ని రహస్యాలను బయటపెట్టారు. ఇటీవలే కాఫీ విత్ కరణ్ సీజన్ 7 మొదలైన విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ లో రణవీర్ సింగ్, అలియా భట్ వచ్చి సందడి చేశారు. ఇక రెండో ఎపిసోడ్ లో జాన్వీ, సారా హంగామా చేశారు. ఈ ఎపిసోడ్ లో జాన్వీకి ఒక చిక్కు ప్రశ్న ఎదురైంది. “మీ మాజీ బాయ్ ఫ్రెండ్ తో శృంగారం చేస్తారా..?” అంటూ కరణ్ అడిగాడు. దానికి జాన్వీ సమాధానం ఇస్తూ” లేదు.. నేను మళ్లీ వెనక్కు వెళ్లలేను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక విజయ్ దేవరకొండ తో డేటింగ్ కు వెళ్లాలని ఉన్న జాన్వీ, సారాతో ఉన్న స్నేహ బంధం గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ గా మారింది.