Jailer 2 Chiranjeevi, Balakrishna Cameo News Viral: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై రజనీ పక్కన మరో ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నరేంద్ర మోడీ, ఇతర నేతల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి, ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా పలువురు తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని కోలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానులు చాలా షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జైలర్ 2 కోసం రజనీకి కొత్త క్యామియో రోల్స్ వచ్చాయి అంటూ రజనీ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. జైలర్‌లో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ క్యామియో రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ పిక్స్ చుసిన వారు జైలర్ 2 లో రజనీకాంత్‌తో పాటు చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరూ నటించే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ త కూలీ సినిమా చేస్తున్నారు.. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు సత్యరాజ్ కూడా నటించనున్నారు. ఇక జైలర్ 2లో ఆయనతో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ నటిస్తే బాగుంటుందని సినీ అభిమానులు అంటున్నారు. మీరేమంటారు?