AP CMO Ex Official Dr Harikrishna Tweet about Tollywood Heros Fans: ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో కీలక అధికారిగా వ్యవహరించిన డాక్టర్ హరికృష్ణ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కి స్పెషల్ సెక్రటరీగా హరికృష్ణ పని చేసేవారు. అలాగే ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, జనరల్ గ్రీవెన్స్, ఓవర్సీస్ కోఆర్డినేషన్ వంటి విషయాలకు ఇన్చార్జిగా వ్యవహరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు.
ఎవరైతే నిజంగా ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతూ ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యశ్రీ ద్వారా అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేతనైన సహాయం ఆయన చేస్తూ ఉండేవారు. అయితే ఆయన సీఎంఓలో కీలక పోసిషన్ లో ఉన్న విషయం తెలుసుకున్న పలువురు హీరోల అభిమానులు తమ దృష్టికి వచ్చిన అనేక కేసులను హరికృష్ణకు టాగ్ చేసేవారు. ఆయన కూడా ఎవరు, ఏమిటి అని చూడకుండా అర్హులైతే వారికి సహాయం చేసేందుకు ఏ మాత్రం వెనకాడే వారు కాదు. ఇక నిన్న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడంతో జగన్ ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నట్టయింది. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ కూడా తన పదవీకాలం పూర్తయిన క్రమంలో ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ చేశారు.
నమస్కారం.. ఇంత కాలం ” YS JAGAN CARES ” ద్వారా వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించడానికి మాకున్న పరిధిలో మా శాయశక్తులా అహర్నిశలూ కృషి చేశాము. మా పదవీకాలం ముగియడం వలన ఇక పై ఈ వేదిక ద్వారా సేవలందించలేమని తెలియజేస్తున్నాము. ఆపదలో ఉన్నవారికి ఎంతటి అర్ధరాత్రైనా ఆపన్నహస్తం అందించాలని తపించిన మా టీమ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా మీద నమ్మకంతో ఎంతో మంది నిస్సహాయుల పరిస్థితిని మా దృష్టికి తెచ్చి.. వారికి సహాయం అందజేసే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకందించిన సహృదయులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు, ముఖ్యంగా అందరు తెలుగు సినిమా హీరోల అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జైహింద్ అని అంటూ ఆయన పేర్కొన్నారు.
నమస్కారం..
ఇంత కాలం " YS JAGAN CARES " ద్వారా వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించడానికి మాకున్న పరిధిలో మా శాయశక్తులా అహర్నిశలూ కృషి చేశాము. మా పదవీకాలం ముగియడం వలన ఇక పై ఈ వేదిక ద్వారా సేవలందించలేమని తెలియజేస్తున్నాము.
ఆపదలో ఉన్నవారికి ఎంతటి అర్ధరాత్రైనా ఆపన్నహస్తం అందించాలని… pic.twitter.com/YZ3y28Gqlw
— Dr Hari Krishna (@HariKrishnaCMO) June 12, 2024