Jagapathibabu : జగపతి బాబు హోస్ట్ గా జయంబు నిశ్చయంబురా అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీ సంస్థ జీ5లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా నాగార్జున వచ్చి హంగామా చేశాడు. ఎంత చేసినా షోకు పెద్దగా క్రేజ్ రావట్లేదు. దీంతో ఇద్దరు సంచలన దర్శకులను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. వారే ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా. వీరిద్దరూ ఒకే స్టేజిపై ఉంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఇద్దరి ఐడియాలజీ ఒకే విధంగా ఉంటుంది. వీరి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. అందుకే వీరిద్దరినీ టాక్ షోకు నేడు పిలిచినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయిందంట.
Read Also : Faria Abdullah : వామ్మో.. చిట్టి ఇలా చూపిస్తే కుర్రాళ్లకు నిద్ర కష్టమే..
ఇందులో కాంట్రవర్సీ ప్రశ్నలు, లైఫ్ కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ బ్లాస్ట్ అవుతుందని టీమ్ చెబుతోంది. దీంతో ఈ షోకు కావాల్సినంత క్రేజ్ కన్ఫర్మ్ అంటున్నారు. జగపతి బాబు ఈ షోను బాగానే రన్ చేస్తున్నాడు. కాకపోతే బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ కు వచ్చినంత క్రేజ్ మాత్రం రావట్లేదు. కానీ పెద్ద సెలబ్రిటీలనే తీసుకువస్తున్నాడు జగపతిబాబు. ముందు ముందు స్టార్ హీరోలు కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది.
Read Also : Tamannaah : బీర్ అంటే ఒక ఎమోషన్ అంటున్న తమన్నా..