Jabardasth: జబర్దస్త్.. బుల్లితెరపై రికార్డు సృష్టించిన కామెడీ షో. ఒకప్పుడు జబర్దస్త్ చూడకుండా పడుకొని కుటుంబం ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ మొదటి యాంకర్ అనసూయ. ఆమె అందచందాలు, నాగబాబు నవ్వు,రోజా పంచ్ లతో జబర్దస్త్ నంబర్ 1 కామెడీ షోగా పేరు తెచ్చుకుంది. ఇక దీనికి కొనసాగింపుగా ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చింది. ఈ రెండు షోస్ బాగా ప్రాచుర్యం తెచ్చుకున్నాయి అంటే ఎక్కువగా యాంకర్ల అందాలే అని చెప్పొచ్చు. జబర్దస్త్ లో అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ తమ అందాలతో అదరగొట్టారు. ఇక ఉన్నాకొద్దీ ఈ షోస్ లో వల్గారిటీ ఎక్కువ ఉండడంతో జనాలు దీన్ని చూడడం ఆపేశారు. అంతేకాకుండా నాగబాబు, రోజా షో నుంచి వెళ్లిపోవడంతో మరింత రేటింగ్ తగ్గిపోయింది. అనసూయ ఈ వల్గారిటీ వలన జబర్దస్త్ షో నుంచే బయటకు వచ్చేసాను అని చెప్పింది.
VarunLav: వరుణ్- లావణ్య రిసెప్షన్.. ఇన్విటేషన్ కార్డ్ వచ్చేసింది
ఇక అనసూయ బయటకు వచ్చాక ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసింది హాట్ బ్యూటీ సౌమ్య రావు. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ.. అందాల ఆరబోత చేస్తూ.. ఓ మోస్తరుగా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ.. సౌమ్య జబర్దస్త్ నుంచి తప్పుకుందని సమాచారం. ఇక ఆ ప్లేస్ లోకి సిరి హన్మంత్ ఎంటర్ అయ్యింది. జవాన్ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ.. ఈ వారం జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చినట్లు చూపించారు. అయితే సడెన్ గా ఈ యాంకర్ మార్పు ఏంటీ అనేది జనాలకు అంతుపట్టలేదు. ఇక సౌమ్యకు ఏమైంది.. ? ఎందుకు ఆమె జబర్దస్త్ నుంచి తప్పుకుంది.. ? తప్పకుందా ..? తప్పించారా ..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి సిరి ఎలా ఈ షోను రన్ చేస్తుందో చూడాలి.