VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. నవంబర్ 1 వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్ళికి హాజరయ్యాయి. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే ఇటలీకి వెళ్లిన మెగా కుటుంబం మొత్తం ఇండియాకు తిరిగివచ్చారు. ఇక ప్రస్తుతం రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు మెగా ఫ్యామిలీ. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో ఇండస్ట్రీని ఎవరిని పిలవకుండా కేవలం బంధుమిత్రుల మధ్యనే ఈ పెళ్లిని కానిచ్చారు. ఇక రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం కదిలిరానుంది. ఈ రిస్పెషన్ ఇన్విటేషన్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nani: ఫ్యామిలీ స్టార్ డైలాగ్.. నాని వెర్షన్ లో ఇలా ఉంటుంది అన్నమాట
ముందు నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఈ రిస్పెషన్ N కన్వెషన్ లో జరగనుంది. ఇక ఇన్విటేషన్ కార్డు చాలా హుందాగా కనిపిస్తుంది. సింపుల్ గా ఉన్నా కూడా ఆకట్టుకొంటుంది. మాదాపూర్ N కన్వెషన్ హాల్ లో నవంబర్ 5 సాయంత్రం వరుణ్- లావణ్య రిస్పెషన్ జరగనుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. టాలీవుడ్ లో అందరు హీరోలు ఈ వేడుకకు హాజరుకానున్నారట. ఇప్పటికే అందరికీ ఈ ఇన్విటేషన్ కార్డులను అందించినట్లు సమాచారం. మరి ఈ రిసెప్షన్ లో ఎవరెవరు పాల్గొంటారో చూడాలి.