అఖిల్ రాజ్, తేజస్వినీ జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఈ కల్ట్ మూవీ ఏపీ మరియు తెలంగాణ లో రెండు రోజుల్లోనే 4.04 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో డామినేషన్ చూపిస్తూ, మొదటి రోజు రూ.1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం, రెండో రోజు మరింత జోరు మీద దూసుకెళ్లి 2 కోట్ల వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లో నైజాంలోనే 3 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకోవడం చిన్న సినిమాలకు కంటెంట్ ఉంటే విజయం ఖాయం అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
Also Read : Spirit: మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం
డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువచ్చారు. అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్‌తో పాటు శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్‌తో ముందుకు సాగుతోంది.