Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం అతిపెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై నమ్మకం లేదనడం రచ్చకు దారి తీసింది. అయితే దీనికి తోడు పాత వీడియోల్లో ఆయన నాస్తికుడు అని చెప్పిన విషయాలను కూడా బయటకు తీస్తున్నారు. ఇంకేముంది మంటల్లో పెట్రోల్ పోసినట్టు రాజమౌళి వివాదం పీక్స్ కు వెళ్లిపోయింది. హిందూ సంఘాలు వరుసగా కేసులు పెడుతున్నాయి. బీజేపీ నేతలు వీడియోలు రిలీజ్ చేస్తూ విమర్శిస్తున్నారు. రాజమౌళి సినిమాలను హిందువులు బ్యాన్ చేయాలంటున్నారు.
Read Also : Winter Bathing: చలికాలంలో రోజూ స్నానం చేస్తే ఆయుష్షు తగ్గుతుందా..? ఈ వాదనలో నిజమెంత..?
చరిత్రలో ఎప్పుడూ ఒక్క వివాదం కూడా లేని రాజమౌళి ఈ వివాదం వల్ల విమర్శలు పాలు అవుతున్నాడు. రాజమౌళి ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ డ్యామేజ్ ను రాజమౌళి కంట్రోల్ చేయాల్సిందే. లేదంటే మాత్రం మరిన్ని ఇబ్బందులు తప్పవు. కానీ రాజమౌళి మాత్రం దీనిపై పెద్దగా స్పందించట్లేదు. ఆయన ఎంత మౌనంగా ఉంటే వివాదం అంత పెద్దది అవుతోంది. ఇలాంటి సెన్సిటివ్ అంశాలను సాగదీయడం మంచిది కాదు. కోట్లాది మంది హిందువుల నమ్మకానికి సంబంధించింది కాబట్టి జక్కన్న క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
Read Also : Bigg Boss 9 Telugu: ఈ వారం నో ఎలిమినేషన్ నా..?