Auto Ramprasad: పంచ్ ఫలకనామకే పంచ్ లు వేయగలడు ఆటో రామ్ ప్రసాద్.. జబర్దస్త్ లో ఆటోలు పేలాలంటే రామ్ ప్రసాద్ కావాల్సిందే. ముగ్గురు మొనగాళ్లు సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను.. ఈ ముగ్గురికి లైఫ్ ఇచ్చింది జబర్దస్తే. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సుధీర్.. హీరోగా, కమెడియన్ గా చేస్తుండగా.. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఒకపక్క జబర్దస్త్ చేస్తూనే.. ఇంకోపక్క సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఆటో రామ్ ప్రసాద్ హెల్త్ బాగోలేదంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. అందుకు కారణం.. అతను తలకు క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. గుండు చేయించుకున్నట్లు కనిపిస్తూ ఉండడంతో అతడికి క్యాన్సర్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అసలు రామ్ ప్రసాద్ కు ఏమైంది. ఎందుకు తలకు క్యాప్ పెట్టుకున్నాడు. అతడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది..? అని అభిమానులు ఆరాలు తీస్తూనే ఉన్నారు.
Adivi Sesh: మాస్టారు.. చిన్న డౌట్.. ఆ కిస్ గురించి పూజాతో మాట్లాడి ఉంటాడా..?
ఇక తాజగా ఈ పుకార్లకు ఆటో రామ్ ప్రసాద్ చెక్ పెట్టాడు. నిన్న కిర్రాక్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్ మణికొండలో సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ కు జబర్దస్త్ టీమ్ మొత్తం వచ్చింది. హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కూడా వచ్చి కిర్రాక్ ఆర్పీకి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఇదే విషయాన్ని రామ్ ప్రసాద్ ను అడగగా ఆయన వీటిన్నింటికి క్లారిటీ ఇచ్చాడు. ” నా ఆరోగ్యం బాగాలేదంటూ వస్తున్న వార్తలో ఎటువంటి నిజం లేదు. తలకు క్యాప్ పెట్టుకున్నా అని నాకేదో క్యాన్సర్ అది ఇది అని రాసుకొచ్చారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నా.. అందుకే క్యాప్ పెట్టుకున్నా. అంతే.. అంతకు మించి ఇంకేం లేదు.. నా గురించి ఇంకేం రాయొద్దు.. నాకేదైనా అయితే మీరు ఉన్నారుగా చూసుకోవడానికి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్లారిటీ తో ఈ పుకార్లకు చెక్ పడినట్టే.