Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకోవడంలో శేష్ దిట్ట. ఈ మధ్యనే హిట్ 2 సినిమాతో పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తనకు పేరుతెచ్చిపెట్టిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నాడు. ఇక శేష్ సినిమాల విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వ్యక్తి. ఏది ఉన్న ముఖం మీద నిర్మొహమాటంగా చెప్పుకొస్తాడు. ఇక ఈ మధ్యనే శేష్, హీరో శర్వానంద్ తో కలిసి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు వెళ్లిన విషయం తెల్సిందే. కుర్ర హీరోలను బాలయ్య ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఇక ఈ షోలో శేష్, హీరోయిన్ పూజా హెగ్డే గురించి మాట్లాడి అందరికి షాక్ ఇచ్చాడు.
“ఇప్పుడు ఈమెతో మాత్రం కిస్ వద్దురా బాబు అని అనుకొనే హీరోయిన్ ఎవరు” అని బాలయ్య అడిగిన ప్రశ్నకు శేష్ టక్కున పూజా హెగ్డే పేరు చెప్పి షాక్ ఇచ్చాడు. పూజాతో ముద్దు ఎందుకు వద్దు అని చెప్పాడు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో డిబేట్లు కూడా నడిచాయి. ఇక తాజాగా శేష్, పూజా హెగ్డేను కలిశాడు. FICCI లేడీస్ ఆర్గనైజషన్ ప్రోగ్రాంలో శేష్ పాల్గొన్నాడు. అక్కడ బాలీవుడ్ లేడీ డైరెక్టర్ ఫరాఖాన్,ప్రియాంక రెడ్డిలతో పాటు పూజా హెగ్డేను కూడా శేష్ మీట్ అయ్యినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలను శేష్ షేర్ చేస్తూ చాలా మంచి రోజు.. ఈ ఈవెంట్ లో వీరందరితో టైమ్ స్పెండ్ చేయడం అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫోటో చూసిన వారందరు ఆ కిస్ గురించే ఆరా తీస్తున్నారు. మాస్టారు.. చిన్న డౌట్.. ఆ కిస్ గురించి పూజాతో మాట్లాడి ఉంటాడా..? అని కొందరు. ఏం భయ్యా కిస్ ఇష్టం లేదు అన్నావ్.. ఇప్పుడు వెళ్లి ఏం మాట్లాడుతున్నావ్ అని ఇంకొందరు.. కొంపతీసి గూఢచారి 2 లో పూజా హీరోయిన్ కాదు కదా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.