Jaat Movie : బాలీవుడ్ హీరో సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన మూవీ జాట్. గోపీచంద్ ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో నేరుగా సినిమా చేస్తున్నారు. దీన్ని టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు పీపుల్స్ మీడియా కలిసి నిర్మించాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ ను నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజు రూ.11.6 కోట్లు వచ్చినట్టు ప్రకటించారు. ఇది కేవలం బాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ అయింది.
Read Also : Nose pin: ‘‘ముక్కు పుడక’’ హంతకుడిని పట్టించింది.. భార్యని చంపిన ఢిల్లీ వ్యాపారి..
ఒక రకంగా ఇది తక్కువ కలెక్షన్లు కాకపోయినా.. సన్నీడియోల్ నటించిన గదర్-2 సినిమాతో పోలిస్తే తక్కువనే. ఎందుకంటే ఆ మూవీకి మొదటి రోజే రూ.40 కోట్ల దాకా వచ్చాయి. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా హీరోయిన్ గా చేసింది. సయామీ ఖేర్, రమ్యకృష్ణన్, జగపతి బాబు, బబ్లూ పృథ్వీరాజ్, జరీనా వాహెబ్, ఉపేంద్ర లిమియే,అజయ్ ఘోష్, ఆయేషా ఖాన్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశీ రౌటేలా అతిథి పాత్రలో చేసింది. ఓ ఊరిని పట్టి పీడిస్తున్న విలన్ ను హీరో ఎలా ఎదుర్కున్నాడనే నేపథ్యంలో సినిమాను తీశారు. ఇది పూర్తిగా తెలుగు ఫ్లేవర్ తో వచ్చిన కథ. ఈ నడుమ బాలీవుడ్ లో తెలుగు ఫ్లేవర్ కథలకు బాగానే ఆదరణ దక్కుతోంది. అందుకే దాన్ని ఇలా తీశారని సమాచారం.