ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం “శాకుంతలం”. సమంత “శకుంతల”గా నటిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ తాజాగా గుమ్మడికాయను కొట్టేశారు. తుది షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. దర్శకుడు గుణశేఖర్ కొన్ని కీలకమైన టాకీ సన్నివేశాలు, దుష్యంత్ పాత్రలో నటించిన హీరో దేవ్ మోహన్‌పై యుద్ధ ఎపిసోడ్‌ని ఇక్కడ రూపొందించారు. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమాకు సంబంధించి సమంత తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. గుణశేఖర్ నేతృత్వంలోని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనిని త్వరలో ప్రారంభిస్తుంది. విజువల్, గ్రాఫిక్స్ సినిమాలో మేజర్ పార్ట్. కెనడా, హాంకాంగ్, చైనాలకు చెందిన టాలెంటెడ్ నిపుణులు విజువలైజేషన్ సరిగ్గా రూపొందించడానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ 10 నెలల కన్నా ఎక్కువ ఉండవచ్చని వెల్లడించాడు. 2022 ప్రారంభంలో “శాకుంతలం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Also : కేఆర్‌కేపై “ఫ్యామిలీ మ్యాన్” పరువు నష్టం దావా
సినిమాలో భారతదేశం ఉత్తర నేపథ్యంలో బృందావనం, కాశ్మీర్, హిమాలయాలు వంటి భారీ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ నిర్మించారు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో, రామోజీ ఫిల్మ్ సిటీ, అనంతగిరి కొండలు, వికారాబాద్ అడవులు, గండిపేట చెరువు, అన్నపూర్ణ స్టూడియోలలో సినిమా షూటింగ్ జరిగింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ముందుగా అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఇంతకుముందే వారి కాంబినేషన్ లో వచ్చిన “రుద్రమదేవి” డిజాస్టర్ అయ్యింది. ఈ ఆఫర్ ను అనుష్క సున్నితంగా తిరస్కరించడంతో “శాకుంతలం” దగ్గరకు చేరుకుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ ను గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతా అక్కినేని ‘శకుంతల’ పాత్ర పోషిస్తుండగా, దేవ్ మోహన్ దుష్యంత్‌గా, అదితి బాలన్ గా అనసూయ, మోహన్ బాబు మహర్షి దుర్వాసుడు, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కన్పించబోతున్నారు. గౌతమి, యాంకర్ వర్షిణి తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.