Prabhas: టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు చూడని ఒక ఉత్కంఠభరితమైన పోరును ఈరోజు భారతీయులు చూసారు. చెమటలు కక్కించే, సీట్ ఎడ్జ్ సీన్స్ లో కూడా ఇంత భయపడి ఉండరు అభిమానులు. పాకిస్తాన్ పై ఎట్టకేలకు ఇండియా విజయాన్ని అందుకొంది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఎక్కడ ఓడిపోతుందో అని ఊపిరి బిగబట్టుకొని, దేవుడ్ని ప్రార్దించిన క్రికెట్ అభిమానులను దేవుడు కరుణించి ఒడ్డున పడేశాడు. ఇండియా గెలిచింది. ఇంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరగడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే కావడం గమనార్హం.
ఇక విరాట్ మ్యాచ్ కు ప్రాణం పోశాడు. ఇక సాధారణంగా విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినా, విజయం అందుకున్నా ఎవరో ఒకరికి డేడికేట్ చేస్తూ ఉంటాడు అని అంటారు అభిమానులు. ఇక ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కాబట్టి విరాట్.. ప్రభాస్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడని ప్రభాస్ ఫ్యాన్స్- క్రికెట్ ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు. ఇక అంతే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ మెల్ బోర్న్ స్టేడియంలో ఒక అభిమాని ఏకంగా హ్యాపీ బర్త్ డే బాహుబలి ప్రభాస్ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని చూపించడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సైతం నిజంగా విరాట్ ఆ ఒక్క మాట చెప్తే అంత కంటే ఇంకేం కావాలంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.