I Bomma Ravi : ఐ బొమ్మ కేసులో ఐదు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు రవిని పోలీసులు విచారించారు. ఈ కస్టడీలో కీలక విషయాలు రాబటారు. ఐ బొమ్మ రవి బ్యాంక్ లావాదేవిలపై ప్రధానంగా ఆరా తీశారు ccs పోలీసులు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా విచారించారు. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ జోడించిన పోలీసులు. NRE , క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్ తో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఆరా తీశారు. ఎందుకంటే రవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే కదా. ఇక ఐ బొమ్మ వెబ్ సైట్, ఐపి అడ్రెస్ సర్వర్ డేటాపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐ బొమ్మ వెబ్ సైట్ రన్ చేసేందుకు ఐపి అడ్రస్ లు ఎలా మార్చాడనేది కూడా కూపీ లాగారు.
Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవిపై సినిమా.. ఇదేం ట్విస్ట్
ఎక్కడెక్కడ ఉంటూ అప్లోడ్ చేసాడు.. ఏమేం టెక్నాలజీ వాడాడు అనే కోణంలో విచారణ సాగింది. ఐ బొమ్మ 1 నుంచి మూవీ రూల్స్ వెబ్ సైట్ కు రీ డైరెక్ట్ కావడంపై కూడా పోలీసులు ఆరా తీశారు. హార్డ్ డిస్క్ లకు పాస్ వర్డ్ లు ఉండటంతో.. రవి ద్వారా వాటిని ఓపెన్ చేయించి ఎథికల్ హ్యాకర్స్ సహాయంతో అనాలసిస్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ లో రవి హోమ్ సర్వర్ల డేటాపై కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఇమ్మడి రవి వాడిన మొబైల్స్ పై వివరాలు సేకరించారు పోలీసులు.
Read Also : Bheems : నేను తప్పుగా మాట్లాడలేదు.. భీమ్స్ క్లారిటీ