Bheems : మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరియోల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మొదట్లో అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ ఆయన.. ఇప్పుడు పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మొన్న రవితేజ మాస్ జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్స్ చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. డబ్బులు లేక కుటుంబం అంతా చనిపోదాం అనుకున్న టైమ్ లో రవితేజ పిలిచి అవకాశం ఇచ్చాడని.. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోను అంటూ తెలిపాడు భీమ్స్.
Read Also : Ustaad Bhagat Singh: ఉస్తాద్ కోసం మరో డేట్?
ఇక మొన్న ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. తనకు నరేశ్ లైఫ్ ఇచ్చాడని తెలిపాడు. దీంతో ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాడంటూ భీమ్స పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో తాజాగా భీమ్స్ స్పందించాడు. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు మొదటి ఛాన్స్ ఇచ్చింది నరేశ్ గారు. ఛాన్సులు లేనప్పుడు పిలిచి నా కెరీర్‌కి పునర్జన్మ ఇచ్చింది రవితేజగారు. ఇదే విషయాన్ని నేను చెప్పాను. అంతే గానీ వేరే ఉద్దేశం లేదు. దీన్ని అర్థం చేసుకోకుండా నన్ను విమర్శిస్తున్నారు అంటూ తెలిపాడు భీమ్స్.
Read Also : Salman Khan: మెగాఫోన్ పట్టనున్న ఖాన్..