I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు రవికి వస్తోంది. ఒక రకంగా మిడిల్ క్లాస్ పాలిట దేవుడు అంటున్నారు. ఇంతటి భారీ పాపులారిటీ దక్కించుకున్న రవి జీవితంపై సినిమా రాబోతోంది. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని తేజ్ ఇండియా డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. రవి జీవితంలో జరిగిన సంఘటనలు.. అతను పైరసీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది.. ఏమేం చేశాడు అనే కోణంలోనే సినిమా చేస్తున్నారంట.
Read Also : Bheems : నేను తప్పుగా మాట్లాడలేదు.. భీమ్స్ క్లారిటీ
ఇందులో రవి కంప్లీట్ జీవితం చూపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రవికి పెరుగుతున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఆయన లైఫ్ స్టోరీని సినిమా రూపంలో చూపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. రవి చేసిన పనులు, ఆయన జీవితంలో ట్విస్టులు ఇందులో హైలైట్ కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రవిని ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయన కేసులో కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Jagan Lawyer: కోర్టు ఆదేశాల మేరకే జగన్ హాజరు..!