IBomma Ravi : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు చేసిన వినతిపై నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉందని సీసీఎస్ పోలీసులు వాదించగా, కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఇప్పటికే…
I Bomma Ravi : ఐ బొమ్మ కేసులో ఐదు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు రవిని పోలీసులు విచారించారు. ఈ కస్టడీలో కీలక విషయాలు రాబటారు. ఐ బొమ్మ రవి బ్యాంక్ లావాదేవిలపై ప్రధానంగా ఆరా తీశారు ccs పోలీసులు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా విచారించారు. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ జోడించిన పోలీసులు. NRE , క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్ తో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఆరా…
Constable Murder : తెలంగాణలో సంచలనం రేపిన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పోలీసులు కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ హత్యకు ప్రధాన నిందితుడైన షేక్ రియాజ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. సారంగాపూర్ సమీపంలో రియాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. Deputy CM Pawan: హ్యాపీ దీపావళి.. నయా నరకాసురులను ఎన్నికల్లో ప్రజలు ఓడించారు.. పోలీసులు రియాజ్…
చిట్టీల పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూ. 100 కోట్లు వసూళ్లు చేసి పుల్లయ్య పరారైన పుల్లయ్యను.. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచాడు చిట్టీల పుల్లయ్య. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ…
ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ ప్రచారం చేసినట్లు బాధితులు వెల్లడించారు.
డబ్బులు సంపాదించడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడటం లేదు. దొంగతనాలు, దోపిడీలు ఇలా ఏది పడితే అది డబ్బుల కోసం చేసేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన.. ఓ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడం కోసమని ఘరానా మోసాలకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ మోసాలతో పాటు నకిలీ వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన డిజిటల్ ఇండియ ప్రైవేట్ లిమిటెడ్ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్‌లో అమిత్ మిశ్ర, విజయ్ ఠాకూర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు తేల్చారు. దొడ్డిదారిలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఈ ఫేక్ కంపెనీ పేరుతో స్కామ్‌కి పాల్పడ్డారని తెలిసింది. ఢిల్లీ నుంచి ఈ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. అంతర్జాతీయ పుస్లకాలు, నావెల్స్ని డిజిటల్ చేస్తున్నామని వెల్లడించింది. ప్రతి పేజీకి…
సంచలనం సృష్టించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ వ్యవహారంపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు సీసీఎస్ పోలీసులు… కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసం రూ.3,520 కోట్లకు చేరినట్టు సీసీఎస్ పేర్కొంది.. ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీసీఎస్.. 5 వేల పేజీల ఛార్జ్సీట్లో కార్వీ సంస్థ మోసాలను పొందుపర్చారు.. 8 ఏళ్ల నుండి బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందిన ఆ సంస్థ.. కస్టమర్ల షేర్లను తమ షేర్లుగా చూపించి బ్యాంక్‌ల నుంచి రుణాలు…