తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన శ్రీలీల గురించి అందరికి తెలిసిందే.ప్రతి సినిమాలో శ్రీలీల పేరు వినిపిస్తుండటంతో శ్రీలీల అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. తాజాగా ఢీ షోకు గెస్ట్ గా వచ్చిన శ్రీలీల తనకు బాల్యంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చారని సమాచారం.. యాంకర్ ప్రదీప్ శ్రీలీలను చూసి ఇప్పుడు స్టేజ్ కు అసలైన కల వచ్చిందని కూడా చెప్పారు.మీకు డ్యాన్స్ కు ఎంత దగ్గరి సంబంధం అని ప్రదీప్ అడగగా శ్రీలీల మాట్లాడుతూ నాకు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఉందని ఆమె అన్నారు.
నాకు సరిగ్గా నడవడం వచ్చో లేదో కూడా తెలీదు కానీ మా అమ్మ ముందు డ్యాన్స్ క్లాస్ కు పంపించేదని శ్రీలీల చెప్పకొచ్చింది. ఆ సమయంలో కాళ్లకు బొబ్బలు వచ్చేవని కూడా ఆమె తెలిపారు. మూడేళ్ల వయస్సులోనే డ్యాన్స్ కోసం అలాంటి టార్చర్ ను అనుభవించానని శ్రీలీల పరోక్షంగా చెప్పుకొచ్చారని సమాచారం.. ఆ సమయంలో అమ్మను నేను బాగా తిట్టుకునేదానినని ఏంటమ్మా నాకు ఈ టార్చర్ తెగ గోల చేసేదానిని అని శ్రీలీల అభిప్రాయం చెప్పుకొచ్చింది.స్కూల్ కి వెళ్లి పోతానమ్మ త్వరగా నన్ను స్కూల్ లో జాయిన్ చెయ్యి అని గట్టిగా అరిచేదానిని అని శ్రీలీల పేర్కొన్నారు. శ్రీలీల తనకు బాల్యంలో ఎదురైన జ్ఞాపకాలను పంచుకోగా ఆ తర్వాత హైపర్ ఆది శ్రీలీలను ఇమిటేట్ చేయడం విశేషం.యాంకర్ ప్రదీప్ డ్యాన్స్ కు మీకు ఏంటి సార్ సంబంధం అని అడగగా ఇది ఇప్పుడు కాదని నాకు మూడేళ్లు ఉన్న సమయంలో నాన్నగారు నేర్చుకోరా డ్యాన్స్ అని తెగ ఇబ్బంది పెట్టారని ఒళ్లంతా కూడా బొబ్బలు వచ్చేవని ఆది చెప్పుకొచ్చారటా.. నాన్న ఇంటికొచ్చాక నేను స్కూల్ కి పోతా నా వల్ల కాదని చెప్పానని హైపర్ ఆది శ్రీలీల ను ఇమిటేట్ చేసాడు. డానికి కౌంటర్ గా ప్రదీప్ డ్యాన్స్ చేస్తే కాళ్లకు బొబ్బలు రావాలి కదా మొహమంతా ఎలా వచ్చాయి అని ప్రదీప్ అడగగా ఫ్లోర్ మూమెంట్స్ చేసే వాడిని లే అని ఆది రివర్స్ కౌంటర్ వేసాడు.