Allu Arjun and Kalyan Ramలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ కారును ఆపి, ఆ కారుకు నల్ల ఫిల్మ్ లు ఉండడంతో వాటిని తొలగించడంతో పాటు 700 రూపాయల జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ఇక అదే దారిలో వెళుతున్న మరో హీరో కళ్యాణ్ రామ్ కారుకు పోలీసులు ఇదే తరహాలో జరిమానా విధించడం విశేషం. ప్రముఖులైనా, సామాన్యులైనా కార్లకు బ్లాక్ ఫిల్మ్ లు ఉపయోగించకూడదనే నిబంధన ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే.
Read Also : Naga Chaitanya : ‘మానాడు’ డైరెక్టర్ తో అక్కినేని వారసుడి మూవీ
ఇక సినిమాల విషయానికొస్తే… ‘పుష్ప’ చిత్రంతో ఇటీవలే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు “పుష్ప-2” సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటీనటులు పార్ట్ 2లో కనిపించబోతున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్ “బింబిసార” చిత్రంతో పవర్ ఫుల్ రోల్ లో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.