చైనాలో విదేశీ బ్రాండ్ ఫోన్ల షిప్పింగ్ 10.09% వృద్ధిని సాధించింది. ఈ లెక్కన యాపిల్ ఐఫోన్ పేరు కూడా ఉండడంతో షాకింగ్ గా ఉంది. ఓ వైపు చైనీస్ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తుండగా.. మరోవైపు చైనాలో విదేశీ ఫోన్ల రవాణా పెరుగుతోంది.
NCERT Chief: భారత రాజ్యాంగం ప్రకారం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ ‘ (Bharath),’ ఇండియా ‘ (India) అనే పదాలను పరస్పరం మార్చుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ తెలిపారు. అన్ని తరగతుల పాఠశాల పాఠ్యపుస్తకాల్లో “ఇండియా” స్థానంలో “భారత్” �
మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్‌ను మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అజిత్ దోవల్ మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2014లో అజిత్ దోవల్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు.
జూలై 4న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడున్న బ్రిటన్ హిందువులు భవిష్యత్తు ప్రభుత్వం కోసం తమ డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి.
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన ఎడ్జ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి రెండు గ్రూపులు సంయుక్తంగా క్షిపణులు, ఆయుధాలను అభివృద్ధి చేస్తాయనున్నాయి.
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.
ఖలిస్థాన్ కు మద్దతుగా మరోసారి నినాదాలు రాసిన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల క్రింద ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించాయి.
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు.