Huge Ruckus at Kollywood due to Tiger 3: టైగర్ 3 కారణంగా తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్ తిరుపూర్ సుబ్రమణ్యం రాజీనామా చేశారు. లియో సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, వాటిని ఫేక్ అని పేర్కొంటూ ఆయన ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. మల్టీప్లెక్స్‌ల సంఘం యజమాని తిరుపూర్ ఎం. సుబ్రమణ్యం తాజాగా తమిళనాడు థియేటర్ మరియు మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శ్రీ శక్తి సినిమాస్ యజమాని అయిన సుబ్రహ్మణ్యం తన రాజీనామా లేఖలో, అసోసియేషన్ అధినేతగా పనిచేసినప్పుడు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదే లేఖలో “అవును. నా థియేటర్ తప్పు చేసింది. (#టైగర్3, 7 AM షో వేసి) శిక్షార్హమైన చర్యలు ఏమైనప్పటికీ, తిరుపూర్ కలెక్టర్ ఎలాంటి చర్యలకు అయినా నేను దానికి కట్టుబడి ఉంటాను… నేను తమిళనాడు థియేటర్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని కాబట్టి, నా సభ్యులకు తప్పుడు ఉదాహరణను కాకూడదని నా పదవికి రాజీనామా చేస్తున్నాను” అని అన్నారు.
Kannur Squad: తెలుగు ఓటీటీలో ప్రత్యక్షమైన మలయాళ బ్లాక్ బస్టర్.. ఎందులో చూడాలంటే?
అయితే టైగర్ 3 కారణంగా తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్ తిరుపూర్ సుబ్రమణ్యం రాజీనామా చేశారని తెలుస్తోంది. ఎందుకంటే సరైన అనుమతి లేకుండా ‘టైగర్ 3’ కోసం ప్రత్యేక మార్నింగ్ షోలు నిర్వహించి ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించినందుకు తిరుపూర్ సుబ్రమణ్యం థియేటర్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. దీపావళి రోజున సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘టైగర్ 3’ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏర్పాటు చేసి ఆయన సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. దీంతో ఆగ్రహించిన తమిళ సినీ అభిమానులు తిరుపూర్ సుబ్రమణ్యం థియేటర్‌కి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిందా అని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేశారు. ఆ తర్వాత తిరుపూర్ సుబ్రమణ్యం థియేటర్‌కి ప్రత్యేక అనుమతి లేదని స్పష్టం చేయడంతో చివరకు అది ఆయన రాజీనామాకు దారి తీసింది. మొత్తం మీద అలా టైగర్ 3 సినిమా తమిళ సినీయే పరిశ్రమలో కల్లోలానికి కారణమైంది.