ప్రయోగాత్మక సినిమాలని, కమర్షియల్ సినిమాలని సరిగ్గా బాలన్స్ చేసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. తన మార్కెట్ ని సౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ‘సూర్య’ 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ మూడో షెడ్యూల్ ఘనంగా మొదలయ్యింది(Suriya 42). శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ‘సూర్య 42’ కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు.
ఈ ఇయర్ సెప్టెంబర్ 9న ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది (#Suriya42MotionPoster) . మోషన్ పోస్టర్ లోని గ్రాఫిక్ వర్క్, దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూర్య బ్యాక్ లుక్ మంచి ఫీడ్ బ్యాక్ ని తెచ్చుకున్నాయి. వెయ్యేళ్ళ క్రితం కథతో, వార్ జనార్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. దాదాపు పది భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ లో ‘సూర్య 42’ సినిమాలోని ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సూర్య 42’ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.