రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ 24 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూస్, రెండు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టింది అంటే సలార్ సినిమాపై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. టీజర్‌లో ప్రభాస్‌ను చూపించకుండా కొంచెం డిజప్పాయింట్ చేసారు కానీ ప్రభాస్ ఫుల్ ఫేస్ టీజర్ లో రివీల్ అయ్యి ఉంటే డిజిటల్ రికార్డ్స్ ఇంకా పీక్ స్టేజ్ ల ఉండేవి. అందుకే ఆగస్టులో సలార్ ట్రైలర్‌తో మాస్ జాతర చేయిస్తామని ప్రామిస్ చేశారు.
ఆగష్టులో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆగష్టు వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండవని అనుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ కానీ ట్రైలర్ కన్నా ముందు సలార్ నుంచి ఇంకో సర్ప్రైజ్ బయటకి రానుంది. సలార్ నుంచి ట్రైలర్ కన్నా ముందు సాంగ్ బయటకి రానుందని సమాచారం. KGF సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటుందో సాంగ్స్ కూడా అదే రేంజులో ఉంటాయి. తుఫాన్ సాంగ్ కైతే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఆ రేంజ్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు సలార్ విషయంలో అది రిపీట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరి కొని రోజులు ఆగాలి. మేకర్స్ ఫస్ట్ సాంగ్ ని రెడీ చేసారట, జులై లాస్ట్ వీక్ లో సలార్ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారట. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ నెక్స్ట్ వీక్ లో బయటకి వచ్చే అవకాశం ఉంది. మరి సలార్ సాంగ్స్ KGFని మించి ఉంటాయా లేదా అనేది చూడాలి.