Heer Aasmani Song From Fighter Released: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. . వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ , సెకండ్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ‘హీర్ ఆస్మాని’ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక విడుదల చేసిన కొద్దిసేపట్లోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాంగ్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె డాన్స్ మూమెంట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Manchu Manoj: మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్న మంచు మనోజ్ దంపతులు..
అంతేకాదు ఎయిర్ ఫోర్స్ పైలెట్ లుక్ లో హృతిక్ రోషన్ వావ్ అనిపించేలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మూవీ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. హృతిక్ ఫిజిక్ కూడా మస్త్ ఉందని, ఫిదా అయ్యామని నెటిజన్లు చెబుతున్నారు. ఈ సాంగ్ హృతిక్ పాటల్లో వన్ ది బెస్ట్ అవ్వనుందని అంటున్నారు. ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించనుండగా.. స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా (దీపికా పదుకొనే)గా కనిపించనున్నారు. ఇక గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ సందడి చేయనున్నారు, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.