Manchu Manoj: మంచు కుటుంబంలో కాస్తా ట్రోల్ చేయకుండా.. అందరు మెచ్చుకునే హీరో అంటే మంచు మనోజ్ మాత్రమే. అన్న, అక్క లా కాకుండా మీడియా ముందు ట్రోల్ కాకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా అందరితో కలిసిపోతాడు. అభిమానులను అయితే తమ్ముళ్లుగా చూసుకుంటాడు. ఇక గత కొన్నేళ్లుగా మనోజ్ ప్రసంగాలు లైఫ్ లో ఎన్నో గందగోళాలు జరిగాయి. ఇక గతేడాది వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడ్డాయి. భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ మధ్యనే వీరు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్ గా ఉంది. మొదటి నుంచి కూడా మనోజ్.. పేదవారికి సాయం చేస్తూనే వచ్చాడు. తాజాగా మరోసారి ఈ దంపతులు తమ గొప్పమనసును చాటుకున్నారు.
నేడు మౌనిక తండ్రి దివంగత నాయకుడు భూమా నాగిరెడ్డి జయంతి. దీంతో బార్యభర్తలు కలిసి.. హైదరాబాద్ లోని ఒక అనాథశరణాలయానికి వెళ్లి అక్కడ పిల్లలతో గడిపారు. అంతేకాకుండా వారికి భోజనం ఏర్పాటు చేయించి.. దగ్గరుండి వడ్డించారు. చిన్నారులకు కావాల్సిన వస్తువులను అందజేశారు. ఇక మనోజ్.. ట్విట్టర్ వేదికగా తన మామ జయంతిని గుర్తుచేసుకున్నాడు. ” మా మామగారు భూమా నాగిరెడ్డి గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుంటున్నాం. నీ ఉనికి తప్పిపోయింది, కానీ నీ ఆత్మ మా హృదయాలలో నివసిస్తుంది. మీ ఆశీర్వాదాలు మమ్మల్ని నక్షత్రాల అంతటా కనెక్ట్ చేస్తూ మాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. హ్యాపీ బర్త్‌డే మామా, మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ఈటీవీ విన్ లో ఉస్తాద్ అనే షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
Remembering my father-in-law, Bhuma Nagi Reddy Garu, on his birthday. 🌟 Your presence is missed, but your spirit lives on in our hearts. Your blessings continue to guide us, keeping us connected across the stars. Happy Birthday Mama, we feel you with us always. ❤️… pic.twitter.com/l21aGRqdDU
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 8, 2024