Harish Shankar: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మికజంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక సినిమా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రణబీర్ నటన, సందీప్ టేకింగ్, మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కొంతమంది సినిమా బాగోలేదని చెప్తున్నా.. చాలావరకు ప్రేక్షకులు సినిమా అంటే ఇలానే ఉండాలి అని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికీ.. రామ్ గోపాల్ వర్మ నిత్యం సందీప్ రెడ్డి వంగా గురించి, యానిమల్ సినిమా గురించి చెప్పుకొస్తూనే ఉన్నాడు. ఇక ఈరోజు నటి రేణుదేశాయ్ సైతం సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చింది. ఇక తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్.. యానిమల్ రివ్యూ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా గురించి ఎంతో విశ్లేషణ ఇస్తూ ఒక లెటర్ రాసుకొచ్చాడు. బావుందంటే , బాగోదేమో అంటూనే.. తనదైన స్టైల్లో సినిమా గురించి చెప్పుకొచ్చి.. చివరికి బాలేదంటే , బాగోదేమో అని ముగించాడు.
“బావుందంటే, బాగోదేమో.. యానిమల్ చూసిన కొంతమంది అనుకుంటున్న మాటలివి, నచ్చిన వాళ్ళు మాత్రం బావుంది అని అనడం లేదు, బద్దలైపోయింది అంటున్నారు. “సినిమాకు రూల్స్ ఏం లేవండీ” అని అందరూ అంటుంటారు. అతను మాత్రం అనకుండా బ్రేక్ చేసి చూపించాడు. సెకండ్ హాఫ్ గురించి నాకు ఆందోళన లేనప్పటికీ..ఇప్పుడు అది మ్యాటరే కాదు. అసలు ఈ వాక్యం రాస్తున్నప్పుడే నేనెంత అమాయకుడును అనే ఫీల్ వస్తుంది. ఎందుకంటే.. నువ్వు కథ గడించి వాదించొచ్చు కానీ, సక్సెస్ గురించి కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే కంటే సినిమా గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళందరూ ఒకటికి రెండుసార్లు చూసారు. అతని పేరు లోనే “వంగా” అని ఉన్నప్పుడు విమర్శలకూ, విశ్లేషణలకూ అతను వంగుతాడనుకోవడం అమాయకత్వం. ఎవరి విషయం ఎలా ఉన్నా, ఎక్కువ లెంత్ ఉంటే రిపీట్ ఆడియెన్స్ రారేమో అన్న నా మిత్ ని సందీప్ తన ఇంటర్వెల్ లో వాడిన గన్ తో పేల్చేసినందుకు తనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ… ఇంతరాశాక నేను సినిమా…బాలేదంటే, బాగోదేమో” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Dear Sandeep @imvangasandeep
My take on ANIMAL…. #AnimalMovie pic.twitter.com/Ch8yqlrt0E— Harish Shankar .S (@harish2you) December 6, 2023