Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hari Priya Vasishta N Simha Got Engaged

Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్‌’ విలన్ పెళ్ళి!

Published Date :December 9, 2022 , 3:51 pm
By Omprakash Vaddi
Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్‌’ విలన్ పెళ్ళి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vasishta N Simha: హరిప్రియ… కన్నడలో స్టార్ హీరోయిన్. అంతేకాదు అటు తమిళ, మలయాళ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. మూడు పదుల ఈ ముద్దమందారం చిన్నప్పుడే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఆ తర్వాత మోడలింగ్ మీదుగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2008లో కన్నడ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హరిప్రియ… ప్రముఖ నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన ‘పిల్ల జమిందార్’లో యాక్ట్ చేసింది. అలానే వరుణ్ సందేశ్ కు ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ మూవీలో జోడీ కట్టింది. ఇందులో ఆమెది కాల్ గర్ల్ క్యారెక్టర్ కావడం విశేషం. కాస్తంత గ్యాప్ తర్వాత బాలకృష్ణ ‘జైసింహా’తో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది.

Hari 1
విశేషం ఏమంటే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు కన్నడ నటుడితో ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యింది. అతను మరెవరో కాదు… సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్‌’లో వన్ ఆఫ్‌ ది విలన్స్ గా నటించిన వశిష్ఠ ఎన్. సింహా. కన్నడంలో పలు చిత్రాలలో నటించిన వశిష్ఠ ‘కేజీఎఫ్‌’ పుణ్యమా అని ఇప్పుడు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. వీరిద్దరికీ మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురించిందో తెలియదు. కానీ… శుక్రవారం నిరాడంబరంగా వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని బహిర్గతం చేశారు. మరి వీరిరువురూ పెళ్ళి పీటలు ఎప్పుడు ఎక్కుతారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hari Priya
  • KGF
  • Nani
  • Tollywood
  • Vasishta N Simha

తాజావార్తలు

  • నేడు SRH vs LSG మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న కాటేరమ్మ కొడుకులు..

  • Uppal Stadium Guidelines: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

  • RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions