Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సీనియర్ స్టార్లు, పాన్ ఇండియా స్టార్ల మధ్య సినిమాల మేకింగ్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సీనియర్ స్టార్లు వేగంగా సినిమాలు చేస్తుంటే, ట్రెండింగ్ స్టార్లు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్లు ప్రేక్షకులకు నిరంతరం వినోదం పంచుతూ మార్కెట్‌ను కాపాడుకుంటున్నారు. ‘విశ్వంభర’ ఆలస్యమైనా.. అనిల్ రావిపూడి, బాబీ (‘కాకా’) లాంటి ప్రాజెక్టులతో చిరంజీవి స్పీడ్ పెంచారు. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’తో పాటు మరో ఫ్యామిలీ సినిమాను లైన్లో పెట్టి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. బాలకృష్ణ ‘దాదా’, కొరటాల శివ ప్రాజెక్టులతో స్పీడ్ చూపిస్తున్నారు. నాగార్జున వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ (‘కుబేర’, ‘కూలీ’) తన కెరీర్లో 100వ సినిమాతో విభిన్నంగా ముందుకెళ్తున్నారు.
మరోవైపు పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబుల లైనప్ భారీగానే ఉన్నా, సినిమాల మధ్య గ్యాప్ బాగా పెరుగుతోంది. ప్రభాస్ చేతిలో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులున్నా, పోస్ట్పోన్మెంట్లు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. రామ్‌చరణ్ (సుకుమార్ ప్రాజెక్ట్), అల్లు అర్జున్ (‘రాఖా’, లోకేష్ చిత్రాలు), ఎన్టీఆర్ (ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’) గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా భారీ చిత్రాలు చేస్తూ ఒక్కో సినిమాకు మూడేళ్లకు పైగా సమయం తీసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’కే పూర్తిగా అంకితమవ్వడంతో ఆయన నుంచి రెగ్యులర్ సినిమాలు అభిమానులకు దూరమవుతున్నాయి. మొత్తం మీద, గ్లోబల్ ఇమేజ్ కోసం ఏళ్ల తరబడి ఒకే సినిమా చేయడం వల్ల ప్రేక్షకులకు కొత్త సినిమాల గ్యాప్ వస్తోంది. సీనియర్ల స్పీడ్, యువ హీరోల పాన్ ఇండియా ఇమేజ్.. రెండింటి లక్ష్యం మార్కెట్ పెంచుకోవడమే అయినా, కేవలం భారీ కాన్వాస్ మాత్రమే సరిపోదు. క్వాలిటీ, బలమైన కథలతో పాటు సినిమాల మధ్య విరామాన్ని తగ్గించుకుని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే గుర్తుండిపోయే చిత్రాలు అందించడమే ఏ స్టార్‌కైనా భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
Also Read
- Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
- Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
- Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
- Prabhas: బాకీ తీర్చుకోనున్న 'డార్లింగ్' ప్రభాస్!
తాజావార్తలు
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
-
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!