Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్లడీ రోమియో’. తాజాగా ఈ చిత్ర బృందానికి ఊహించని తలనొప్పి ఎదురైంది. షూటింగ్ లొకేషన్ నుంచి ఏకంగా కీలక సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఢిల్లీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఢిల్లీలోని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుతుండటం టీమ్‌కు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టింది.
ఢిల్లీ రోడ్లపై జరుగుతున్న షూటింగ్‌ను చూసేందుకు స్థానికులు భారీగా ఎగబడ్డారు. ఈ క్రమంలో పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరణ దృశ్యాలను బంధించి, నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే ఆ వీడియోలు వైరల్ కావడంతో నాని సినిమాలో ఎలా కనిపించబోతున్నారనే సరికొత్త లుక్ ముందే బయటపడిపోయింది. కేవలం లుక్ మాత్రమే కాకుండా, కథలో అత్యంత కీలకమైన కొన్ని సీన్లకు సంబంధించిన డిటైల్స్ కూడా లీక్ అయిన వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుండటం మేకర్స్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కీలకమైన ఎపిసోడ్లు తెరకెక్కిస్తున్న తరుణంలో ఇలా లొకేషన్ విజువల్స్ బయటకు రావడం సినిమా హైప్‌పై, సస్పెన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో రాబోయే షెడ్యూళ్లలో లొకేషన్ల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, మొబైల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించాలని నిర్మాణ సంస్థ యోచిస్తోందట.
Also Read
ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత వెంకట్ బోయనపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను 2027 వేసవి కానుకగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా, సినిమా షూటింగ్ మొదలైన తొలినాళ్లలోనే ఇలా వీడియోలు లీక్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!