Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
- బాంబే హైకోర్టుకు నటుడు ఇమ్రాన్ ఖాన్ బేషరతు క్షమాపణలు..
- భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనబోనని హామీ..
- ఈ దేశం, రాజ్యాంగంపై అపారమైన ప్రేమ ఉందని అఫిడవిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ ‘‘ఇండియాను వదిలి వెళ్లాలి’’ అనే ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం కోర్టు విచారించింది. అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తి దేశ నిరసనల్లో ఎలా పాల్గొంటారు? అని ప్రశ్నించింది. ఇదే అమెరికాలో భారతీయ పౌరుడు పాల్గొంటే వెంటనే విమానంలో దేశానికి తిరిగి పంపిస్తారని వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే, హైకోర్టు ఆగ్రహంతో ఇమ్రాన్ ఖాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనబోనని కోర్టుకు హామీ ఇచ్చారు. భారతదేశంపై, రాజ్యాంగంపై ప్రేమ, గౌరవం ఉన్నాయని తన అఫిడవిట్లో పేర్కొన్నాను. తాను ఆ రోజు నిరసనల్లో పాల్గొనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లలేదని, కేవలం చూడటానికి వెళ్లానని స్పష్టం చేశారు. సోమవారం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీ. త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం ముందు ఇమ్రాన్ ఖాన్ తన అఫిడవిట్ సమర్పించారు.
Also Read
- Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
- Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
- Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
- Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
భవిష్యత్తులో తాను ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోనని ఇమ్రాన్ హామీ ఇచ్చారు. నిరసనల్లో పాల్గొనేలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయడం, ప్రేరేపించడం కూడా చేయనని పేర్కొన్నారు. తాను 42 ఏళ్లలో 40 ఏళ్లు భారత్‌లోనే గడిపానని ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. ఈ దేశ చట్టాలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వాటిని అక్షరాలా పాటిస్తానని తెలిపారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!