School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ అప్రమత్తమయ్యాయి. ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పల్నాడు, బాపట్ల, నెల్లూరుతో పాటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ అధికారులు రేపు ముందస్తు సెలవు ప్రకటించారు.
నెల్లూరు – నరసాపురం మధ్య, ముఖ్యంగా ఒంగోలు సమీపంలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదముందని అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read
- Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
- Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. 'భోగి' వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
- Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, ప్రాణనష్టం జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అధికారులు, వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!