Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daredevil Movie: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త ప్రాజెక్ట్‌పై నడుస్తున్న ఊహాగానాలకు తెరపడింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డేర్‌డెవిల్’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా పట్టాలెక్కింది. చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అజిత్ సతీమణి షాలిని అజిత్ కుమార్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా ప్రారంభమైన సంగతి పక్కన పెడితే.. మేకర్స్ అనౌన్స్ చేసిన భారీ తారాగణం ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న అంశం టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్గా ఎంపిక కావడం. రీసెంట్గా ఆమె ఈ సినిమాలో నటించడం లేదనే వార్తలు వైరల్ కాగా, తాజా పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొని వాటిని చెక్ పెట్టారు. అజిత్‌తో ఆమె జతకట్టనుండటం ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్‌పై భారీ క్యూరియాసిటీని పెంచేసింది.
మలయాళ యాక్షన్ స్టార్ ఉన్ని ముకుందన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. విలక్షణ నటనకు మారుపేరైన తమిళ సీనియర్ యాక్టర్-డైరెక్టర్ ఆర్. పార్థిబన్ కీలక పాత్ర పోషిస్తున్నారు, అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర దక్కించుకుని సర్ప్రైజ్ చేశారు. ఈ భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. అజిత్ – అనిరుధ్ కాంబినేషన్‌కు సౌత్ బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుప్రీమ్ సుందర్ స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను విజయ్ చూస్తున్నారు. ఒకే ఫ్రేమ్‌లో అజిత్, శ్రీలీల, ఉన్ని ముకుందన్, సునీల్ లాంటి క్రేజీ స్టార్స్ కనిపించనుండటంతో ‘డేర్‌డెవిల్’పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. పూజా వేడుకలతోనే ఈ రేంజ్ వైబ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
- Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
- Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
- Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
తాజావార్తలు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై అనుమానాలు: వైసీసీ.. రేపే ఓట్ల లెక్కింపు
-
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
-
Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!