Hanuman: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా .. ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అవనున్న అన్ని సినిమాల భవిష్యత్తును మార్చేసింది. అదే సలార్. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే.. సెప్టెంబర్ 28 న ఈ సినిమా రిలీజ్ కావాలి. కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోవడంతో.. మిగతా సినిమాలు తమ డేట్స్ ను ఖర్చీప్ వేసి కన్ఫర్మ్ చేసుకున్నాయి. దాదాపు డిసెంబర్ నుంచి జనవరి వరకు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ను ప్రకటించడమే కాకుండా.. అందుకు సంబంధించిన వర్క్స్ కూడా చేసేస్తున్నాయి. ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే .. చిన్న సినిమాలతో పాటు ఇంకో స్టార్ హీరో సినిమాలను కూడా పక్కకు తప్పిస్తారు.. లేదా.. వారు ఆ సినిమాతో పోటీ ఎందుకని పక్కకు తప్పుకుంటారు.
Nayanthara: 50 సెకన్లకు రూ. 5 కోట్లు ఏంటీ పాప.. నమ్మేలా ఉందా అసలు.. ?
ఇక మిగిలిన సినిమాల విషయాల గురించి పట్టించుకోకుండా సలార్ డిసెంబర్ 22 న వస్తున్నట్లు ప్రకటించడంతో గందరగోళం మొదలైంది. డిసెంబర్ లో వచ్చే సినిమాలు సంక్రాంతికి షిఫ్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలను వాయిదా వేసుకోవాలని కోరడం కూడా జరిగాయి. అందులో హనుమాన్ సినిమా కూడా ఒకటి. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రాబోతుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా కూడా ఎప్పటినుంచో వాయిదాలు పడుతూనే వస్తుంది. కానీ, ఈసారి మాత్రం అసలు తగ్గేదే లేదని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. సంక్రాంతి నుంచి తప్పుకోవాలని కొంతమంది నిర్మాతలు అడిగినా కూడా పక్కకు తప్పుకోవడాలు లేవు అని డైరెక్టర్ నిర్మొహమాటంగా వస్తున్నాం అంతే అని చెప్పుకొచ్చాడు. మరి ఏయే సినిమాలు ఏయే డేట్స్ కు వస్తాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
#HanuMan 12 JAN 2024 💪🏽 pic.twitter.com/GW0Rd1TYjI
— Prasanth Varma (@PrasanthVarma) September 29, 2023