హనుమాన్… ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తున్న హనుమాన్ సినిమా రేంజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. హనుమాన్ మూవీ ఈరోజు క్రియేట్ చేసిన హైప్, ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమా క్రియేట్ చేయలేదు. టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ హనుమాన్ సినిమాని ఆకాశానికి ఎత్తాయి. ఈ స్థాయిని తెలుపుతూ హనుమాన్ సినిమా ప్రీమియర్స్ చాలా సెంటర్స్ లో సోల్డ్ అవుట్ అయ్యాయి. జనవరి 12న గుంటూరు కారం సినిమా వస్తుండడంతో హనుమాన్ చిత్ర యూనిట్ మొదటిరోజు పెద్దగా థియేటర్స్ దొరికే అవకాశం లేదు కాబట్టి ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేయడానికి రెడీ అయ్యారు.
జనవరి 11 నుంచి అంటే మరో 48 గంటల్లో కొన్ని సెలెక్టెడ్ సెంటర్స్ లో హనుమాన్ సినిమా పైడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ ప్రీమియర్స్ కి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే… హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. హనుమాన్ సినిమాకి పబ్లిక్ లో ఎంత క్రేజ్ ఉందో చూపిస్తూ కేవలం క్షణాల్లో టికెట్స్ బుక్ అవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరీ ముఖ్యంగా నైజాం సెంటర్స్ లో హనుమాన్ సినిమా టికెట్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యాయి. దీంతో హనుమాన్ మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రీమియర్స్ కోసం షోస్ పెంచే పనిలో ఉన్నారు. ప్రీమియర్స్ నుంచి టాక్ పాజిటివ్ గా బయటకి వస్తే చాలు హనుమాన్ సినిమా సంక్రాంతి చిత్రాల్లో మొదటి హిట్ సినిమాగా నిలుస్తుంది.
#HANUMAN Hype Mode ONNN 🔥🔥
All Premiere Shows SOLD OUT for JAN 11th & Extra Shows being added on demand 💥
Book Your Tickets Now 🎟️
– https://t.co/dBexo2Z3SuNizam Release by @MythriOfficial
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123In WW Cinemas from JAN 12, 2024!… pic.twitter.com/L8nKn3EKPT
— Mythri Movie Makers (@MythriOfficial) January 9, 2024