Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా మహేష్ క్రేజ్ చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. మహేష్ గురించిన ఏ చిన్న విషయం అయినా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. గతరాత్రి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ నే హైలైట్ అయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గతరాత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు మహేష్ బాబు, రాజమౌళి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కు మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒక నార్మల్ టీ షర్ట్ వేసుకొని ఎంతో సింపుల్ గా కనిపించాడు.
Adhik Ravichandran: స్టార్ హీరో కూతురితో ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్టర్ పెళ్లి.. ?
ఇక టీ షర్ట్ చూడడానికి చాలా సింపుల్ గా ఉండే సరికీ అందరూ సూపర్ అంటూ చెప్పుకురావడమే కాకుండా దాని రేట్ ఎంతో తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసి.. షాక్ అవుతున్నారు. లైట్ పింక్ కలర్ నెక్ టీ షర్ట్ ధర.. రూ 47, 000 వేలు అని తెలుస్తోంది. ఇక ధర చూసి అందరూ ఖంగుతిన్నారు. అంత సింపుల్ గా ఉన్న టీ షర్ట్ ధర 47 వేలా అని ఆశ్చర్యపోతున్నారు. అయినా.. బాబు ఏది వేసుకున్నా సూపర్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ .. గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.