Hansika Motwani :
మూడు పదుల ముద్దమందారం హన్సిక మోత్వాని పదిహేనేళ్ళ క్రితం ‘దేశముదురు’తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. బాలనటిగా హిందీ చిత్రాలలో నటించిన హన్సిక నాయికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ ఇప్పటికీ నటిస్తూ ఉంది. తమిళంలో నటించిన ‘మహ’ ఆమెకు హీరోయిన్ గా 50వ చిత్రం. ఈ సినిమా ఇదే నెల 22న తెలుగులో విడుదల కాబోతోంది. హన్సిక టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో హీరో శింబు ఓ ప్రధాన పాత్రను పోషించడం విశేషం. యుఆర్ జమీల్ దర్శకత్వంలో మదియళగన్ ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్, సస్పెన్స్, థ్లిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మహ’లో శ్రీరామ్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉంటే హన్సిక నటించిన డైరెక్ట్ తెలుగు సినిమాలు ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ కూడా విడుదలకు సిద్థంగా ఉన్నాయి.