Guntur Kaaram Trailer:గత రెండు రోజుల నుంచి అభిమానులకు గుంటూరు కారం.. మహేష్ బాబు, నాగవంశీ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అకౌంట్స్ చూడడమే పనిగా మారిపోయింది. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ, టైమ్ ఇవ్వకపోవడంతో.. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కింది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.
ఇకపోతే గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ నిన్ననే కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వలన అది ఆగిపోయింది. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి.. ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, సెక్యూరిటీ కారణాల వలన ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెట్టి.. ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ట్రైలర్ రిలీజ్ అన్నారు కానీ, అది ఏ టైమ్ అని మాత్రం చెప్పలేదు. దీంతో ఉదయం నుంచి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అందరూ కాచుకొని కూర్చున్నారు. ఇప్పటివరకు ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చింది కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకెప్పుడు రా.. ట్రైలర్.. అర్ధరాత్రి ఇస్తావా ఏందీ ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్ ఎప్పుడొస్తుందో చూడాలి.