Poorna Marriage Cancelled: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ సినిమాలతో పూర్ణ వెలుగులోకి వచ్చింది. రవిబాబు అవును సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అనంతరం సినిమాల్లో నటించినా విజయాలు దక్కకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది. గత ఏడాది వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న ఆమె పెళ్లికి సిద్ధమైంది. ఆసిఫ్ అలీ అనే దుబాయ్ వ్యాపారవేత్తతో హీరోయిన్ పూర్ణకు ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు కూడా తెగ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also: Film Chamber: తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్ల సమావేశం.. టికెట్ రేట్లపైనా?
ప్రస్తుతం హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో తన కాబోయే భర్త షనీద్ అసిఫ్ అలీని సోషల్ మీడియా వేదికగా పూర్ణ తన అభిమానులకు పరిచయం చేసింది. అయితే అలీతో వివాహానికి పూర్ణ ఇష్టంగా లేదని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నటి పూర్ణ తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించకపోవడంతో అవన్నీ పుకార్లేనని మరికొందరు అంటున్నారు.
అయితే అసలు ఈ ప్రచారం ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలియడం లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదని వాదిస్తున్నారు. ఈ విషయం మీద పూర్ణ స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారం ఆగే అవకాశం కనిపించడం లేదు. గతంలో చాలా మంది హీరోయిన్లు నిశ్చితార్థం చేసుకుని పెళ్లి పీటల వరకు వెళ్లిన తర్వాత అవి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, హీరోయిన్ మెహ్రీన్ కూడా నిశితార్ధం వరకు వెళ్లి తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. మరి పూర్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.