పాన్ ఇండియా మోజులో దర్శకులు, హీరోలు, నిర్మాతలు పరిగెడుతున్న సమయంలో మాస్ కమర్షియల్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్, హీరో-హీరోయిన్ రోమాన్స్, ఐటమ్ సాంగ్… ఇలా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ కి ఆడియన్స్ కూడా అలవాటు పడిపోయారు. ఈమధ్య కాలంలో చూసిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా ఏంటి అని ఎవరినైనా అడిగితే టక్కున సమాధానం చెప్పడం కూడా కష్టమే. అన్ని యాక్షన్ సినిమాల మధ్యలో, పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సమయంలో ఒక క్లీన్ ఫ్యామిలీ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ‘రామబాణం’ మేకర్స్. మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘రామబాణం’ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది.
ఇప్పటికే గోపీచంద్ కి రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్, రామబాణం సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో జరుపుకుంటున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా, ఒక్క మ్యూట్ లేకుండా రామబాణం సినిమాకి సెన్సార్ మెంబర్స్ క్లీన్ ‘U/A’ ఇచ్చారు. దీంతో “మేము ఎంత వెతికినా ఒక్క ఆడియో కట్ కానీ, వీడియో కట్ కానీ మాకు దొరకలేదు అని మమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేసి, కొన్ని యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి U/A ఇస్తున్నాం అని చెప్పి పంపించారు… థాంక్స్ టు సెన్సార్ టీమ్” అంటూ రామబాణం మేకర్స్ ఒక నోట్ రిలీజ్ చేశారు. మరి స్కూల్ హాలీడేస్ వచ్చేసాయి కాబట్టి అందరూ ఈ సమ్మర్ సీజన్ లో ఫ్యామిలీతో థియేటర్స్ కి వెళ్లిపోయి ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి.
https://t.co/2UEsy3ODHJ pic.twitter.com/Iqewu4efpE
— Sriwass Oleti (@DirectorSriwass) April 26, 2023