Pawan Kalyan : మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మంచి ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. నందమూరి బాలయ్యతో చేసిన వీరసింహారెడ్డి పెద్ద హిట్ అయింది. దాంతో పాటు మొన్న బాలీవుడ్ హీరో సన్నీడియోల్ తో చేసిన జాట్ మూవీ కూడా బాగానే ఆడుతోంది. దీంతో ఆయన మళ్లీ తెలుగు హీరోలతోనే సినిమాలు చేయాలని చూస్తున్నాడు. రీసెంట్ గానే పవన్ కల్యాణ్ కు స్క్రిప్ట్ లైన్ చెప్పినట్టు సమాచారం. ఒక మాసివ్ కథ లైన్ చెప్పడంతో పవన్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి కథను రాసుకుని రమ్మన్నాడంట. పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు.
Read Also : HIT-3 : ’RRR’ రికార్డు బద్దలు కొట్టిన హిట్-3 ట్రైలర్
అటు ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. అదే టైమ్ లో గోపీచంద్ కు కూడా కొన్ని డేట్స్ ఇవ్వబోతున్నాడంట. ఈ ఏడాది కల్ల తన చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేసేసి.. వచ్చే 2026 నాటికి గోపీచంద్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడంట గోపీచంద్. వరుస హిట్లతో జోష్ మీదున్నాడు కాబట్టి పవన్ కల్యాణ్ కూడా ఆయనపై మంచి నమ్మకం ఉంచుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ డేట్స్ ఎక్కువగా ఇవ్వడం కుదరదు కాబట్టి.. తక్కువ డేట్స్ లోనే సినిమాను కంప్లీట్ చేసేందుకు గోపీచంద్ ప్రిపేర్ అవుతున్నాడంట. అందుకు తగ్గట్టే కథ రాసుకుంటున్నట్టు సమాచారం.