టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అని అనకూడదు ఏమో బహుశా. తెలుగులో సినిమాలు ఏవి చేయడమే మానేసింది నటి సమంత. హీరోయిన్ గా సినిమాలు తగ్గించి నిర్మాతగా మారింది ఈ మాజీ హీరోయిన్. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : Kollywood : హీరోగా మారుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్
కాగా కొద్దీ రోజుల నుండి ఈ సినిమా ప్రీమియర్స్ ను లిమిటెడ్ గా కొన్ని చోట్ల ప్రదర్శించారు. ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే ట్రైలర్ లో చుపించినట్టు పిల్లా.. పెళ్ళి.. పిల్లోడు. స్టార్ట్ అయి అక్కడక్కడ కాస్త నవ్వులు, కాస్త భయపెట్టే సన్నివేశాలహతో ఒక కొత్త కాన్సెప్ట్ తో కొంతవరకు కామెడీతో బండి లాగించాడు. కానీ చాలా చోట్ల కథ డిప్ అవుతుంది. కొన్ని కొన్ని చోట్ల షార్ట్ ఫిల్మ్ ఫీల్ అనిపిస్తుంది. చిన్న ట్విస్ట్ తో విరామం. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా ఘాడి తప్పుతుంది. ఈ సినిమాలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఓకే చిన్న థ్రెడ్ కథ అల్లి దాంతోనే సినిమాను ఆసాంతం నడపాలి అంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఇక్కడ అదే ఉండదు. సరికదా సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఓకే కానీ తెరపై మలిచిన విధానం మెప్పించదు. ప్రోడుక్షన్ వాల్యూస్ సినిమాకు తక్కువ.. షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువలా అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఫైనల్ గా శుభం చూడాల్సిందే.. కానీ థియేటర్ లో కాదు ఓటీటీలో.