కోలీవుడ్ స్టార్ దర్శకుడు అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రెండవ సినిమాగా కార్తీతో చేసిన ఖైదీ సినిమాతో లోకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క రాత్రిలో జరిగే కథతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Also Read : Krithi Shetty : తెల్ల డ్రెస్ లో భలే ఉన్నావమ్మా.. బేబమ్మ
ఇక వెంటనే విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ తో స్టార్ డైరెక్టర్స్ లో నంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు లోకేష్ కనగరాజ్. కాగా ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకుడి నుండి హీరోగా మారబోతున్నాడట. అవును మీరు చదివింది నిజమే. లోకేష్ కనగరాజ్ హీరోగా తమిళ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమా వస్తోంది. ఇప్పటికే కథ చర్చలు ముగిసాయి. కోలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబందించి అధికారక ప్రకటన రానుంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న లోకేష్ హీరోగా కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.