Goat: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. నిన్ననే ఈ సినిమా మొదటి సాంగ్ అయ్యో పాపం సారూ సాంగ్ అప్డేట్ ను మేకర్స్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి 3 న ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి ఇంకా హైప్ క్రియేట్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అయ్యో పాపం సారూ.. ఎట్టా బుక్కయ్యారు. లారీ గుద్దిన ఆటోలా దెబ్బయ్యి పోయారు. అయ్యో పాపం సారూ.. ఇట్టా లాక్ అయ్యారు.. 3D లో చూస్తున్నారు హర్రర్ పిక్చరూ అంటూ సాగిన లిరిక్స్ ఎంతో క్యాచీగా ఉన్నాయి. ఇక వీడియోలో ఆ వీధిలో రౌడీగా అందరిని భయపెట్టే కుర్రాడు.. ఒక అమ్మాయి వలలో పడి ఆమె చెప్పినట్లు చేస్తున్నట్లు చూపించారు. దివ్యభారతి షాపింగ్ బ్యాగ్ లు మోయడం.. ఆమె చున్నీని ఉతకడం లాంటివి చూపించగా .. పక్కన ఆంటీలు వీడికి తిక్క కుదిరింది అన్నట్లు చూడడం ఆకట్టుకుంటుంది.సురేష్ బనిశెట్టి అందించిన లిరిక్స్ కు లియోన్ జేమ్స్ సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. రేపు ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రానుంది. సాంగ్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.