Game Changer to release on December 25th 2024: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్ లో ఇబ్బందుల నేపథ్యంలో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామని విషయం కూడా క్లారిటీ లేకుండా షూటింగ్ పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా సినిమా యూనిట్ పని చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలా అయినా పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులో లేదా దసరా సందర్భంగా అప్పుడు కూడా కుదరకపోతే దీపావళి కానుకగా దింపుతారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాని ఏకంగా డిసెంబర్ నెలకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Kangana :ఎట్టకేలకు ఓపెనయిపోయిన కంగనా.. అందుకు ఇదే కరెక్ట్ టైం అంటూ!
ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీ బుధవారం వచ్చింది. తర్వాత గురువారం ఒక్కరోజు వదిలేస్తే శుక్రవారం నుంచి వీకెండ్ కలిసి వస్తుంది. లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో అదే రోజున సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓపెనింగ్ కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉండేలా ఈ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గేమ్ చేంజర్ ఒక పొలిటికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రలలో నటిస్తున్నట్లుగా చెబుతున్నారు. దిల్ రాజు -శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఒకటి నిన్ననే పూర్తయింది. మార్చి రెండో వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి .ఇక ఈ గేమ్ చేజర్ రిలీజ్ డేట్ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. త్వరలో రాంచరణ్ తేజ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆ సందర్భంగా అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.