రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కెజిఎఫ్ 2’ ఎన్నో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14 న విడుదలైన ఈ సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. సినిమా విడుదలై నెల దాటినా ఇప్పటికీ తన హవాని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సందడి చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ అని లేకుండా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇటీవలే ఈ చిత్రం రూ. 1200కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు షాక్ ఇస్తూ అమెజాన్ పే ఫర్ వ్యూ పద్దతిలో సినిమాను స్ట్రీమింగ్ చేసింది. మార్చి 16 నుంచి ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సబ్‌స్క్రైబర్లు అదనంగా రూ.199 పెట్టి ఈ సినిమాను చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా అమెజాన్ కెజిఎఫ్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది.
ఎట్టకేలకు ఈ సినిమా ఫ్రీ గా చూసే అవకాశం అమెజాన్ కల్పించింది. ఈ విషయాన్నీఅమెజాన్ సిసిల మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. జూన్ 3 నుంచి ‘కెజిఎఫ్ 2’ ఎటువంటి అదనపు డబ్బులు కట్టకుండానే ఉచితంగా వీక్షించవచ్చు. దీంతో అమెజాన్ సబ్స్ స్క్రైబర్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మరోపక్క దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని చడీ చప్పుడ కాకుండా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక నార్మల్ సినిమా ఓటిటీలోకి వస్తుంది అంటేనే ఎనెతో హంగామా చేస్తున్న తరుణంలో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఇలాంటి సినిమా ఓటిటీలోకి అడుగుపెడుతుంటే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండాలని రాఖీ బాయ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి జూన్ 3 లోపు అమెజాన్ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.
Join Rocky on his journey to rule the world!! 🔥#KGF2onPrime, streaming from June 3 pic.twitter.com/m2dAaqxomE
— amazon prime video IN (@PrimeVideoIN) May 31, 2022