Site icon NTV Telugu

Flop Heroin’s : ఆ యంగ్ హీరోపైనే భారం మోపిన ప్లాప్ హీరోయిన్స్

Dulquer Salmaan

Dulquer Salmaan

ఏ మూహుర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్‌ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ప్లాప్ భామలు కూడా దుల్కర్ ని లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరుకారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్‌గా స్టార్టైన ఈ మూవీ సెట్‌లోకి త్వరలో స్టెప్ ఇన్ కాబోతోంది. పూజా టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగుమం చేసిన దుల్కర్.. ఆమె ప్లాప్ పరంపరకు అడ్డుకట్ట వేస్తాడేమో చూడాలి

Also Read : Bollywood : తన కన్నా ఏజ్‌ ఏక్కువున్న భామలతో రొమాన్స్ చేస్తున్న స్టార్ హీరో

అందం,అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ మిస్టర్ బచ్చన్‌లో అందాలు ఆరబోసినా లక్‌ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో ఆదుకుంటాడు అనుకుంటే ఈ మూవీ కూడా ప్లాప్ అయింది. ఇక భాగ్యశ్రీ తన హోప్స్ అన్నీ ‘కాంత’ పైనే పెట్టుకుంది. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ.. టైటిల్‌ జస్టిఫై చేసేలా తన క్యారెక్టర్‌తో ఆకట్టుకోగలిగితే.. భాగ్యశ్రీ ప్లాప్స్ నుండి గట్టెక్కే అవకాశం ఉంది.   కూలీతో యావరేజ్ అందుకున్న శృతి హాసన్ కూడా దుల్కర్‌నే నమ్ముకుంది. ఆకాశంలో ఓ తారలో కీ రోల్ ప్లే చేస్తుంది. సలార్ తర్వాత డెకాయిట్ అనవసరంగా వదులుకున్న శృతి … ప్రజెంట్‌ చేస్తున్న తెలుగు ఫిల్మ్ ఇదే. దుల్కర్ హీరోగా వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్స్‌లో ఇలా ప్లాప్ హీరోయిన్లను పట్టుకొస్తుంటే నిర్మాతగానూ తన ఫ్రెండ్, టాలీవుడ్ ఎంట్రీతో సక్సెస్ కొట్టిన కళ్యాణీ ప్రియదర్శన్‌ను పాన్ ఇండియా ఫిల్మ్ “లోఖా”తో మళ్లీ టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాడు. రణరంగం భారీ డిజాస్టర్ తర్వాత పెట్టాబేడా సర్థుకుని మాలీవుడ్ చెక్కేసిన కళ్యాణీ.. “లోఖా”తో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ గుమ్మం టచ్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version