ఏ మూహుర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్‌ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ప్లాప్ భామలు కూడా దుల్కర్ ని లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరుకారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్‌గా స్టార్టైన ఈ మూవీ సెట్‌లోకి…