YVL N Shastri: పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ రైటర్, కథా రచయిత తోట ప్రసాద్ పలు దిన, సినిమా వార పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తోట ప్రసాద్ తన భార్య గీత, రెండవ కుమార్తె మనోజ్ఞ సహకారంతో కరోనా బాధితులకు దాదాపు రెండు నెలల పాటు ఉచితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. ఆయనలోని మానవీయ కోణాన్ని గుర్తించి సినీ ప్రముఖులు అభినందించారు. ఆగస్ట్ 14న తోట ప్రసాద్ కుమార్తె మనోజ్ఞ వివాహం సాయికృష్ణతో…