YVL N Shastri: పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు.